పుల్కల్, సెప్టెంబర్ 5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండిం ది. గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాజెక్టు 4,6 క్రస్ట్ గేట్లను స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 27192 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో , 19507 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, గొర్రెకాపరులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28.749 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తికి 2822 క్యూసెక్కులు విడుదల చేయగా, క్రస్ట్ గేట్లతో 16284 క్యూసెక్కులు, తా లేల్మ ఎత్తిపోతల పథకానికి 31క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూస్కు 80కూసెక్కులు, మిషన్ భగీరథకు 70కూసెక్కులు, వృథాగా 220 కూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు.