పుల్కల్, అక్టోబర్ 4 : సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్న ది. శుక్రవారం రెండు గేట్ల ద్వారా అధికారులు 22,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2677 క్యూసెక్కులను విడుదల చేశారు.
శుక్రవారం 19, 488 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 22,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 29.678 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.