రాయపోల్, మే 25 : రాయపోల్ మండల పరిధిలోని విత్తన డీలర్ల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం అకస్మిక తనిఖీలు జరిపింది. ఆగ్రో రైతు సేవా కేంద్రం 1, అడిషనల్ ఆగ్రో రైతు సేవా కేంద్రం 2, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ ట్రేడర్స్ అనాజిపూర్ విత్తనాలు, పురుగు మందుల షాపుల్లో సోమవారం టాస్క్ ఫోర్స్ టీమ్ సోదాలు చేసింది. మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, స్థానిక ఎస్సై కె. మానస సంయుక్తంగా తనిఖీలు జరిపి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లైసెన్స్‌లు , స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్‌లను పరిశీలించారు.
లైసెన్స్ కలిగిన కంపనీల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే అమ్మాలని.. ధరలు, స్టాక్ బోర్డులను షాపు ముందర ఏర్పాటు చెయ్యాలని దుకాణదారులకు టాస్క్ ఫోర్స్ బృందం సూచించింది.
విత్తనాలు, ఎరువులు ,పురుగుల మందులు కొన్న వెంటనే రైతులకు రశీదు తప్పని సరిగాఇవ్వాలని.. రశీదు నందు రైతుల సంతకాలు తప్పకుండా తీసుకోవాలి మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, స్థానిక ఎస్సై కె. మానస చెప్పారు.
తనిఖీలు జరుపుతున్న వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, ఎస్సై మానస

నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఎస్సై మానస హెచ్చరించారు. అలానే ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విత్తనాలు, ఎరువుల అమ్మినచో కేసులు నమోదు చేస్తామని, కాలం చేల్లిన విత్తనాలు అమ్మినా కూడా చట్టం ప్రకారం శిక్ష అనుభవిస్తారని తెలిపారు. పాత స్టాకు, వ్యాలిడిటీ లేని స్టాకు దుకాణంలో ఉంటే విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ బృందం హెచ్చరించింది.