సిద్దిపేట : పంటలు కొనుగోళ్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరిగోస పెడుతుందని సర్పంచ్ తిరుపతిరెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రహదారిపై పోద్దు తిరుగుడు రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 45 రోజుల నుంచి సొసైటీ కార్యాలయం ఆవరణంలో ధాన్యం పోసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.