Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
Solar Energy production centre | నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.
Solar Energy production centre | నర్సాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులతో నర్సాపూర్ పట్టణంలోని మెదక్ మార్గంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాదాయ భూములలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సోలార్ ప్లాంట్ స్థాపనకై స్థల పరిశీలన చేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ కార్యాలయం నుండి చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు బృందం వచ్చింది.
ఈ సందర్భంగా స్థల పరిశీలనతోపాటు దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్‌కు పవర్ సప్లై, స్థలంని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలోని నాలుగు గ్రామ సంఘాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. మొదటిగా రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావుతోపాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, నాబార్డ్ నుండి ఏజీఎం రామారావు, నాబార్డ్ కన్సల్టెంట్ రామకృష్ణ, రెడ్ కో సంస్థ నుండి రవీందర్ చౌహన్ డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్, విద్యుత్ శాఖ ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్, ఏపీఎం గౌరీ శంకర్, ఏపీఓ అంజిరెడ్డి, మండల సర్వేయర్ అభిలాష్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

