సంగారెడ్డి, జూన్ 22: బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పెండింగ్ పనులను వేగం గా పూర్తిచేయాలని, ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశించారు. శనివారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఆర్, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్ష్షాకాలం ప్రారంభ మైనందున పట్టణంలో ముంపునకు గుర య్యే నారాయణరెడ్డి కాలనీ వరద రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దూదిబాయ్, మాసానికుంట చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుంచి వరద కాలనీలు ముంచెత్తకుండా చూడాలన్నారు. సిం గూరు కుడి కాలువను సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ వరకు పొడిగించి సాగునీరు అందించాలన్నారు. నియోజకవర్గంలోని చెక్‌డ్యామ్‌లు, గంగకత్వ లైనింగ్ పనులు, నక్కవాగుపై చెక్‌డ్యామ్‌లు, మల్కాపూర్ పెద్ద చెరువు మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఫసల్వాది మంజీరా బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణం పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు నాలుగులేన్ల రోడ్డు పనులు, రాజంపేట రోడ్డు పనుల పురోగతిపై ఆరాతీశారు. సమావేవంలో కొం డల్‌రెడ్డి, గోవర్ధర్ నాయక్, దీపక్, బాలగణేశ్, రవీందర్, శశాంక్, కాపాసాల బుచ్చిరెడ్డి, జీవి శ్రీనివాస్, విఠల్ పాల్గొన్నారు.