రాయపొల్.మే 9 : నిరుపేదలకు ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పాల రామగౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం మంతూర్ గ్రామానికి చెందిన బందరం మైసవ్వ, సాయిలు కుమార్తె తేజస్వి పెళ్లికి గ్రామ పెద్దలతో కలిసి పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి కలిగుతుందన్నారు. రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో గతంలో కూడా నిరుపేద వధువులకు పుస్తె మట్టెలు అందించామని గుర్తు చేశారు.
తనకు తోచిన విధంగా గ్రామాల్లో పేద ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి పేదలు ఆపద ఉంటే వెంటనే స్పందించి అండగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు పదవి ముఖ్యం కాదని, పేదలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతామన్నారు.