Harish rao | పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు.. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి : హరీష్ రావు
Harish rao | సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్ష 99వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీరె ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్లంతా ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Harish rao | సిద్దిపేట , నవంబర్ 25 : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట నియోజక వర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ ప్రతి బతుకమ్మకి 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మహిళలకు చీరెలు అందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న సుమారు 46 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్ష 99వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీరె ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్లంతా ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
రేవంత్ రెడ్డి ఇస్తానన్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న నెలకు రూ.2500 సంగతి ఏందీ.. రెండేళ్లలో 60 వేలు ఇచ్చి సారే పెట్టాలి.. రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయ్యాలి. పట్టణ ప్రాంతాల్లో చీరెలు లేవు. వడ్డీలేని రుణాలు లేవు.. పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవు. మహిళ సంఘాలు 25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే 5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతుంది. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో స్త్రీ నిధి కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చాము..ఇప్పుడు స్త్రీ నిధి వడ్డీ ఋణం ఇవ్వడం లేదు. స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మీ పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడుతా.. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తానన్నారు. ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళ సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి రెండు ఏండ్లు అయినా ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడ కూడా పెట్టలేదు.
కేసీఆర్ పండుగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రైతు బంధు ఓట్లకు.. చీరల పంపిణీ ఓట్లకే.. వడ్డీ లేని రుణాలు ఓట్లకే.. రుణ మాఫీ సగం ఇచ్చిండు సగం ఎగ్గొట్టిండు.. ఆశ పెట్టడం.. ఆయాస పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం ఈ ముఖ్య మంత్రికి అలవాటుగా మారిందన్నారు.
Read Also :
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

