సిద్ధివినాయక పాహిమాం.. జయగణేశా రక్షమాం
సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి 224వ జయంత్యోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వందలాది మంది దంపతులతో వేదపండితులు యాగాలు నిర్వహించారు.
- వైభవంగా రేజింతల్ సిద్ధివినాయక స్వామిజయంత్యోత్సవాలు
- మూడు రాష్ర్టాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
- ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ప్రముఖులు
- నేడు స్వామివారి కల్యాణోత్సవం
- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
న్యాల్కల్, జనవరి 14: సంగారెడ్డి జిల్లాలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి 224వ జయంత్యోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వందలాది మంది దంపతులతో వేదపండితులు యాగాలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9గంటలకు సిద్ధి, బుద్ధి సమేత సిద్ధివినాయక స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్ రేజింతల్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింలు కోరారు. నారాయణఖేడ్ మండలం బాణాపూర్‌కు చెందిన వామన్‌రావు మహారాజ్ ఆధ్వర్యంలో వందలాది మంది పాండురంగస్వామి భక్తులు పాదయాత్రగా ఆలయానికి వచ్చి పూజలు చేశారు. వారికి నారాయణఖేడ్, మనూర్, రాయికోడ్, న్యాల్కల్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే హరీశ్‌రావు పూజలు..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీసీబీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, నేతలు ఏర్పుల నరోత్తం, తన్వీర్ హైమద్ తదితరులు ఉత్సవాలకు హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం నేతలు ఆలయంలో పూజలు చేశారు. బర్ధిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరిమహారాజ్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్లు పెంటారెడ్డి, విజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ గౌసోద్దీన్, బీఆర్ఎస్ మండల నాయకులు పాండురంగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గౌసోద్దీన్, సుధాకర్‌రెడ్డి, రఫీయొద్దీన్, చంద్రశేఖర్‌రెడ్డి, మహేశ్, హసన్, సర్పంచులు రవికుమార్, మల్లారెడ్డి, అమీర్, మారుతీయాదవ్, కుతుబుద్దీన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్ రేజింతల్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింలు, ఉపాధ్యక్షులు నీల రాజేశ్వర్, బస్వరాజ్, సెక్రటరీ కల్వ చంద్రశేఖర్, చిద్రి లక్ష్మణ్, కమిటీ సభ్యులు కె.రవికుమార్, సుధాకర్ పాటిల్, బస్వరాజ్ సిందోల్, రాజ్‌కుమార్ అగర్వల్, చంద్రశేఖర్, అశోక్, మేనేజర్ కృష్ణ, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

