చేర్యాల/సిద్దిపేట : గత ఏడాది కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం సందర్భంగా రూ.లక్ష ప్రకటించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ఆలయానికి డబ్బులు పంపించి మొక్కు చెల్లించుకున్నారు.
ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల పై సమీక్ష జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య మంత్రి హరీశ్‌రావు కల్యాణోత్సవం సందర్భంగా ప్రకటించిన రూలక్షను తీసుకువచ్చి ఆలయ ఈవో అలూరి బాలాజీకి అందించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య, చేర్యాల టౌన్ యూత్ అధ్యక్షుడు యాట భిక్షపతి తదితరులున్నారు.