
సిద్దిపేట : దుబ్బాకలోని శ్రీ వేకంటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి వారికి మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
