
తూప్రాన్ రూరల్, జూలై 5: తూప్రాన్ పట్టణంలో పట్టణప్రగతి, మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పల్లెప్రగతి పనులు జోరందుకున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు,అధికారులు పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిలో 13వ వార్డులో పాడుబడిన పెంకుటిండ్లను మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్,అధికారులు కూల్చివేయించారు. తన పుట్టినరోజు సందర్భంగా పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ దీపక్‌రెడ్డి, డైరెక్టర్లు హరితహారం మొక్కను నాటారు. మండలంలోని దాతర్పల్లి, వెంకటరత్నాపూర్‌లో ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఎంపీడీవో అరుంధతి పల్లెప్రగతి పనులు 4వ రోజు కావడంతో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు సమిష్టి భాగస్వామ్యంతో శ్రమదానం పనులను నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు.ఇస్లాంపూర్‌లో ఎంపీడీవో అరుంధతి గ్రామస్తులతో కలిసి శ్రమదానం పనుల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీవో రమేశ్,ఈజీఎస్ ఏపీవో సం తోష్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
ఇంటింటికీ ఆరు మొక్కలు
రామాయంపేట, జూలై 5: పట్టణ ప్రగతిలో ప్రతి వార్డు కౌన్సిలర్ తమ వార్డులో మొక్కలు నాటడం, పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. రామాయంపేట మున్సిపల్లో ప్రభుత్వ సిబ్బంది, ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలిచ్చారు. హరితహారం మొక్కలు నాటడంలో గాని, పరిశుభ్రతలో గాని ఎక్కడ కూడా రాజీ పడేది లేదన్నారు. అనంతరం గిరిజన తండాలో పర్యటించి తండాల మహిళల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకుని మహిళలకు ఇంటికి ఆరు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్లు సుందర్‌సింగ్, మల్యాల కవిత, కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, చింతల యాదగిరి ఉన్నారు.
పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి
వెల్దుర్తి, జూలై 5: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మరింత మెరుగ్గా అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆరెగూడెంలో ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరైన రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించి, గ్రామంలో హరితహారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్మూలనతో పాటు గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి, సర్పంచ్ శేఖర్, నాయకులు నరేందర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, ముత్యాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హరిత మండలంగా తీర్చిదిద్దుదాం
నిజాంపేట, జూలై 5: పల్లెలు పచ్చదనంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల ప్రజలు మొక్కలు నాటి నిజాంపేటను హరిత మండలంగా తీర్చిదిద్దుదాం అని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. సోమవారం ఆయన నిజాంపేటలో మండల ప్రజాపరిషత్ కార్యలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు.మండలంలోని ప్రతి గ్రామంలో అధికారులు,ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పల్లె ప్రగతి పనులలో పాల్గొనాలని, సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, మండల సర్పంచులు నర్సవ్వ, రజిత, అమరసేనారెడ్డి ఎంపీటీసీలు రాజిరెడ్డి,సురేశ్,బాల్‌రెడ్డి,మండల వ్యవసాయ అధికారి సతీశ్, విద్యుత్ ఏఈ సంతోష్‌కుమార్, ఎంపీవో రాజేందర్, ఏపీవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ కరిముల్లా, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
10 లోగా పనులు పూర్తి కావాలి…
మనోహరాబాద్, జూలై 5 : పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అ న్నారు. శివ్వంపేట మండలంలోని మగ్ధుంపూర్, శభాష్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈనెల 10 వరకు వైకుంఠదామం పనులను పూర్తి చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలంలోని గౌతోజిగూడెంలో గ్రామ స్వాగత బోర్డును ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రేణుకఅంజనేయులు, వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరిబాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి పరిరక్షించాలని డీఈవో రమేశ్ అన్నారు. మనోహరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హరితహారంలో భాగంగా సోమవారం మొక్కలను నాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం పాఠశాలలోని ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.