హుస్నాబాద్‌టౌన్, మార్చి 27: సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. హుస్నాబాద్‌లో ఆదివారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 21కె రన్, 10కె రన్, 5కె రన్‌ను సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల మాట్లాడుతూ.. ఆరోగ్యం మనకు ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఉదయమే అందరు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే ఆరోగ్య తెలంగాణగా మారుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేందుకు వాకింగ్, రన్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెడల్ రావడం ఒక గుర్తింపు మాత్రమేనని, ఇందులో పాల్గొనడమే మీరు విజయం సాధించినట్లుగా భావించాలని అన్నారు.
నెల రోజుల పాటు పోలీసుశాఖ చేసిన కృషి ఫలితంగా హాఫ్ మారథాన్‌కు 1500 మందికిపైగా యువతీ, యువకులు హాజరుకావడం అభిందనీయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ప్రతి ఏటా జనవరి చివరి వారంలో హాఫ్ మారథాన్, మారథాన్‌ను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రకటించారు. జూన్ 2వతేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికోసం 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, అక్కన్నపేట జెడ్పీటీసీ భూక్య మంగ, అడిషనల్ ఏసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, హుస్నాబాసీఐ రఘుపతిరెడ్డి, మున్సిపల్వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.