కొమురవెల్లి, జూన్ 11: ఆధునిక పోలీస్సేష్టన్ను నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ. కోటి నిధులు వెచ్చించింది. ప్రారంభించే సమాయానికి ఎన్నికల కోడ్ వచ్చింది. నాటి నుంచి పోలీస్ స్టేషన్‌ను అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో పోలీస్‌స్టేషన్ పరిస్థితి…. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేశారు. దానిలోభాగంగా కొమురవెల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేయడంతోపాటు శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ వెళ్లే దారిలో నూతనంగా పోలీస్‌స్టేషన్ నిర్మించుటకు స్థలం కేటాయించి ఆధునాతన పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసి నిర్మించారు.
ఆధునాతన పోలీస్ స్టేషన్…
రూ.కోటి నిధులతో కొమురవెల్లిలో ఆధునాతన పోలీస్‌స్టేషన్‌ను నిర్మించారు. నాటి ఎస్సై చంద్రమోహన్ యాదవ్ పలువురు దాతల సాయంతో పోలీస్‌స్టేషన్ చుట్టూ అందమైన మొక్కలను నాటించమే గాక, స్టేషన్‌కు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేవిధంగా పోలీస్ స్టేషన్ తీర్చిదిద్దాడు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతోపాటు ఎస్సై చంద్రమోహన్ సైతం బదిలీకావడంతో పోలీస్ స్టేషన్ ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వం మారడంతో నాటి నుంచి నూతన భవనం మరుగున పడింది.
అదే కారణమా..?
నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేసన్ సమీపంలోనే వైన్‌షాప్ ఉంది. గతేడాది ఎన్నికల కోడ్‌కు ముందు కొమురవెల్లికి చెందిన గీస కిష్టయ్య అనే వ్యక్తి సమీపంలోని వైన్ షాప్‌లో మద్యం తాగి అప్పటికే నిర్మాణం పూర్తయిన పొలీస్‌స్టేషన్ భవనం ఆవరణలో మృతి చెం దాడు. ఆ కారణంతోనే పోలీస్‌స్టేషన్ భవ నం పూర్తయిన ప్రారంభించలేదని గుసగుసలు వినిస్తున్నాయి.మూఢనమ్మకాలపై అపోహలు నమ్మవద్దని సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే పోలీసులు తమ వరకు వచ్చే సరికి వేరేవిధంగా ఉన్నారని చర్చించుకుంటున్నా రు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపి పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు.