Thoguta | గుడికందులలో కథక్ నృత్య శిక్షణ..ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
జడ్.పి.హెచ్.ఎస్ గుడికందుల పాఠశాలలో తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నిత్య శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
తోగుట ఫిబ్రవరి 27 : సిద్దిపేట జిల్లా తొగుట మండలం జడ్.పి.హెచ్.ఎస్ గుడికందుల పాఠశాలలో SPIC MACAY (The Society for the Promotion of Indian Classical Music and Culture Amongst Youth) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నిత్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ సాంస్కృతిక సంప్రదాయ కళలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి ఆస్కి దేశాయ్ విద్యార్థులకు కథక్ నృత్యంలోని ప్రాథమిక మెలుకువలు, తాళాల ప్రాముఖ్యత, భావవ్యక్తీకరణ, పదనిసలు వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నాట్యకళ ద్వారా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందుతాయని ఆమె తెలియజేశారు.
పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పరుపాటకం అంజిరెడ్డి గారు మాట్లాడుతూ, “ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. కనకారాములు, టి. హనుమారెడ్డి, ఎన్. రవీందర్ రెడ్డి, బి. శివయ్య, ఐ. భాస్కర్, కే. అనసూయ, సి.ఆర్.పి. వై. వెంకటస్వామి, టీ. లావణ్య, ఎల్. బిక్షపతి పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

