రాయపోల, జూన్,05 : తెలంగాణ రాష్ట్ర కుమ్మరుల సంఘం రాష్ట్ర యూత్ కార్యదర్శిగా సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం ఉప సర్పంచ్ హన్మంతు రాజును నియమిస్తూ రాష్ట్ర కో ఆర్డినేటర్ అమరవాది సారంగపాణి, రాష్ట్ర కన్వీనర్ ఏనుగుతల యాదగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మరుల న్యాయమైన హక్కుల సాధన కోసం అందుబాటులో ఉండి కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కుమ్మరులకు తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రభుత్వంతో కొట్లాడుతామని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న కుమ్మరులను చైతన్యం చేసి గ్రామ గ్రామాన యూత్ కమిటీలు వేసి చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇందుకు ఆయా గ్రామాల కుమ్మరుల సహాయ సహకారాలతో తమకు న్యాయమైన హక్కుల వాట కోసం అందరిని చేతనం చేసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థపకులు ఆకారం మోహన్‌కు అయన కృతజ్ఞతలు తెలిపారు.