గజ్వేల్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఓటమి ఖాయమని టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్ హరితరెస్టారెంట్లో మున్సిపల్ చైర్మన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉద్య మ కాలం నుంచి ఈటెల రాజేందర్‌ను ప్రోత్సహించిన కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడన్నారు. అక్ర మంగా భూకబ్జాలు చేసి పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండడంతో అతన్ని పదవిని నుండి తొలగించారన్నారు. అతని అభివృ ద్ధికి కారణమైన టీఆర్ఎస్ను వీడి బీజేపీతో జతకట్టి హుజురాబాద్ ఎన్నికల బరిలో ఈటెల నిలబడడం సిగ్గు చేటన్నారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమనాయకుడు గెల్లుశ్రీనివాస్‌ను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం తెలంగాణ పర్యాటకానికి ఎంతో గొప్పతనంగా భావిస్తున్నామ న్నారు. రామప్పదేవాలయాన్ని సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.