రాయపోల్ : భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని దౌల్తాబాద్ మండల తాహసీల్దార్ చంద్రశేఖర రావు అన్నారు. భూభారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని మల్లేశంపల్లి గ్రామంలో భూ సమస్యలపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని చాలామంది రైతులు భూ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని ఆన్ లైన్లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులు వాటి వివరాలు నమోదులో ఎలాంటి తప్పిదం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరుగుతుందని, సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని పేర్కొన్నారు.
భూభారతి చట్టంలో రైతుల సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయని అన్నారు. దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా జరిగిన భూభారతిలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీరామ్ ప్రేదీఫ్, మండల సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, సౌజన్య, శ్రావణ్, ఉమ్మడి మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ అధ్యక్షులు సత్యనారాయణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.