సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల శ్రీనివాస్ తనయుడు కొలుపుల నవీన్ కుమార్‌కు (Kolupula Naveen)దళిత రత్న అవార్డు దక్కింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలలో భాగంగా దళితుల్లో అట్టడుగు వర్గాలకు అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రటించినట్లు తెలిపారు.
ఈమెరకు రవీంద్రభారతిలో ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు, రామచంద్రం గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తన యొక్క భాద్యతను మరింత పెంచిందన్నారు. అవార్డును మా నాన్నగారి సేవకి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై దళితుల్లో అత్యంత వెనుకబడ్డ కులాల హక్కులకోసం నిరంతరం కృషిచేస్తానని తెలిపారు.