తునికి బొల్లారం పీఅండ్ఆర్ కాలనీని సందర్శించిన సీఎస్
తునికి బొల్లారం| కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం నూతనంగా నిర్మించిన తునికి బొల్లారం పీఅండ్ఆర్ కాలనీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. కాలనీలోని మౌలిక సదుపాయాలు, ఇండ్లను పరిశీలించారు.

సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం నూతనంగా నిర్మించిన తునికి బొల్లారం పీఅండ్ఆర్ కాలనీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. కాలనీలోని మౌలిక సదుపాయాలు, ఇండ్లను పరిశీలించారు. కాలనీలో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని సీఎస్ సంతృప్తి వ్యక్తంచేశారు. దేశంలోనే అత్యుత్తమ కాలనీగా తునికి బొల్లారం పీ అండ్ ఆర్ కాలనీ నిలుస్తుందన్నారు. భూ నిర్వాసితులతో సీఎస్ మాట్లాడారు. కాలనీలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను గురించి సీఎస్‌కు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వివరించారు.
కాగా, ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో భూ నిర్వాసితుల కోసం అత్యుత్తమ కాలనీని నిర్మిస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారు నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని వసతులతో కాలనీని నిర్మించారని చెప్పారు. సీఎస్ వెంట రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

