రాయపోల్ సెప్టెంబర్ 26 : భూమికోసం,భూక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని చాటిచెప్పిన నిప్పు కనిక మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు రాచకొండ భిక్షపతితో పాటు పలువురు మండల రజక సంఘం నాయకులు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన జరుపుకోవడం ఎంతో ఎంతో సంతోషం ఉందన్నారు. కాగా, మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు. రజక రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.