రాయపోల్ ఆగస్టు 15 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంగ యాదగిరి 2024-25 బ్యాచ్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన అనూష(547) రూ.10.000 వేలు, అలాగే క్రిష్ణేశ్వరికి (505) రూ.5.000 సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ అఫ్జల్ హుస్సేన్ మాట్లాడుతూ యాదగిరి గతంలో కూడా విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, మధ్యాహ్నం పూట అల్పాహారం అందించారన్నారు.
అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సైతం బహుమతులు అందజేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యామల, మాజీ ఎంపీటీసీ వీరమ్మ, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గడ్డమీద రేఖ, పోతురాజు యాదమ్మ, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు సంబగ రాజేందర్, సూరంపల్లి ప్రవీణ్, మేడ్చల్ నవీన్, గజిబింకర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.