చేర్యాల, మార్చి 17 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 22వ తేదీన దేవస్థానానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ తదితర వాటికి వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. గురువారం ఆయన మల్లన్న ఆలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. స్వామి వారి ఆలయానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో తాత్కలిక లైసెన్స్ పద్ధతి పై వ్యాపారం చేసుకునే హక్కుల కోసం(నెం.2 నుంచి 26 షాపుల వరకు) సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అలాగే దేవాలయ అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో (షాపు నెం.1 నుంచి 10)లో వ్యాపారం చేసుకునే హక్కులు పొందడం కోసం వేలం పాటలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీ వరకు వేళం పాటలో పాల్గొనే వారు షెడ్యూల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 21వ తేదీన షెడ్యూలు జారీ చేస్తామన్నారు.
ఒక్కో షెడ్యూల్‌కు రూ.2వేల నగదు చెల్లించాలని సూచించారు. ఆసక్తిగల వ్యాపారులు స్వామి వారి ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆయనతో ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్ తదితరులున్నారు.