గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామానికి చెందిన గజ్జెల యాదగిరి(40) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో వేములఘాట్ గ్రామానికి చెందిన ఓపెన్ ప్లాట్లలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.