బెజ్జంకి, మార్చి 10 : అక్రమగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. సిద్దిపేటకు చెందిన వారనాసి సంజయ్ అనే వ్యక్తి ఓమిని వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో గురువారం ఉదయం పోలీసులు తనిఖీ చేపట్టారు.
వాహనంలో తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోని సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. మండలంలోని రేషన్ బియ్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలుంటాయని ఎస్ఐ హెచ్చరించాడు. అలాగే వడ్లూర్ గుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.