సిద్దిపేట, నవంబర్ 5 : మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు యాదాద్రి ఆలయ గోపురాన్ని బంగారు తాపడానికి సిద్దిపేట కౌన్సిలర్లు, కార్యకర్తలు బంగారాన్ని స్వచ్ఛందంగా ప్రకటించారు. శుక్రవారం సిద్దిపేటలోని తెలంగాణ భవన్లో జరిగిన కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తల సమావేక్షంలో మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బంగారం ఇస్తున్నట్లు చెప్పారు. ‘ఎవరికి తోచినంత అంత ఇవ్వండి.. తర్వాత ఎంత అవసరం పడ్డా నేనిస్తా.. ఇది దైవ, సేవ, గొప్ప పుణ్యక్షేత్రానికి మనమందించే ఉడుత భక్తి’.. అని మంత్రి చెప్పారు. యాదాద్రి ఆలయ గోపురాన్ని బంగారు తాపడానికి సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఆయన సోదరుడు నర్సింలు 5 తులాల బంగారం, 3వ వార్డు పక్షాన వంగ తిరుమల్‌రెడ్డి, వంగ నాగిరెడ్డి 3 తులాలు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి 2 తులాలు, మేర సత్తయ్య 2 తులాలు, రెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2 తులాలు, దీప్తి నాగరాజు 39 వార్డు ప్రజలు కలిసి ఒకటిన్నర తులాలు, బర్ల మల్లికార్జున తులం, గణేశ్‌నగర్ యూత్ తులం, 5వ వార్డు కౌన్సిలర్ వినోద్ తులం, తీపిరెడ్డి మహేశ్‌రెడ్డి తులం, ఇర్షాద్ హుస్సేన్ తులం, 15వ వార్డు ఇమాంబాద్ ప్రజల తరఫున శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య, దామోదర్ తులం, 2వ వార్డు ప్రజల పక్షాన కౌన్సిలర్ చంద్రం తులం, సిద్దిపేట పట్టణ మహిళలు తులం, నర్ర రవి తులం, నాయకం లక్ష్మణ్ తులం, నర్సపూర్ రమేశ్ తులం, 43వ వార్డు ఎల్లం యాదవ్ తులం, కూర బాల్‌రెడ్డి తులం, తాడూరి సాయి ఈశ్వర్‌గౌడ్ తులం, శ్రీనివాస్‌యాదవ్ కాళ్లకుంట కాలనీ తులం, 26వ వార్డు హయాత్బాబా తులం, కౌన్సిలర్ డాక్టర్ విఠోభా తులం, కాటం రఘు తులం, మణిదీప్‌రెడ్డి తులం, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకురాలు నాగరాణి తులం ప్రకటించారు. మహిపాల్, బండల మల్లేశం, బూర మల్లేశం, బోయ రాములు అర తులం చొప్పున విరాళాలు ప్రకటించారు.