Anil Ravipudi | ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా తొమ్మిది హిట్లతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 2026 సంక్రాంతికి విడుదలైన తన తాజా చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన హీరోగా కూడా నటించాలనే కామెంట్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఈవెంట్లో జరిగిన సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. స్టేజ్‌పై సీనియర్ కమెడియన్ అలీ, నటులు శివాజీ, ధన్ రాజ్ కలిసి అనిల్‌ను హీరోగా ఒక సినిమా చేయాలని కోరారు.
ఈ సరదా సంభాషణ మధ్య అలీ తన పర్స్ నుంచి అమెరికా డాలర్ నోట్ తీసి “ఇదే అడ్వాన్స్” అంటూ అనిల్‌కు ఇచ్చాడు. ఈ సన్నివేశం అక్కడ ఉన్న వారిని నవ్వుల్లో ముంచేసింది. అయితే డాలర్ అడ్వాన్స్ తీసుకున్న అనిల్ రావిపూడి చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. “సినిమా చేస్తాను కానీ హీరోగా మాత్రం కాదు” అని స్పష్టం చేశాడు. “మీరు ఇచ్చిన ఈ డాలర్ కోసం మీకు ఓ సినిమా తీస్తాను” అంటూ చమత్కరించాడు. దీంతో స్టేజ్‌పై ఉన్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. అనిల్‌కు హీరోగా నటించే ఉద్దేశ్యం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చినట్లైంది.ఇక ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి చేసిన మరో వ్యాఖ్య కూడా ఆసక్తికరంగా మారింది.
శివాజీ గారు కాల్ చేసి ఈ ట్రైలర్ లాంచ్‌కు రావాలని కోరారు. ‘మొన్న దండోరా ఈవెంట్లో మాట్లాడినట్టుగా కాకుండా ఈసారి జాగ్రత్తగా మాట్లాడతా అని చెప్పారు అని అనిల్ వెల్లడించాడు.దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై చేసిన అసభ్య వ్యాఖ్యలతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా కమిషన్‌కూ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి జాగ్రత్తగా ఉంటానని శివాజీ చెప్పిన మాటలను అనిల్ సరదాగా ప్రస్తావించడంతో సభలో నవ్వులు పూశాయి. మొత్తంగా ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి హీరో ఎంట్రీపై వచ్చిన చర్చలు, అలీ ఇచ్చిన డాలర్ అడ్వాన్స్, శివాజీ వ్యాఖ్యలు అన్నీ కలిసి ఈ వేడుకను హైలైట్ చేశాయి.