చేర్యాల, ఆగస్టు 23: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన తాగునీరు, సాగు నీరు, రైతులకు పెట్టుబడి అందించడంతో పాటు వారు పండించిన పంటలు నేరుగా మార్కెట్లకు తీసుకుపోయేందుకు వీలుగా రోడ్ల నిర్మాణాల పై ప్రత్యేక దృష్టి సారించారు.
కోట్లాది రూపాయలతో బీటీ, సీసీ రోడ్లు నిర్మించారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణం కోసం పైసా మంజూరు చేయలేదని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. పట్టణ శివారు గడితోటకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా తయారై నడవడానికి వీలులేని పరిస్థితి నెలకొన్నది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.