Vittaleshwara Kalyanotsavalu | పెద్దశంకరంపేట, జూలై 07 : పెద్దశంకరంపేట పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో విఠలేశ్వర కళ్యాణ ఉత్సవాలు రెండోరోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఆలయంలో వేదబ్రాహ్మణ పండితుల మంత్రోశ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ అవరణలో వేదబ్రాహ్మణ పండితులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరళివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం విఠలేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలయ పూజారులు సంగమేశ్వర్, మహేశ్‌శర్మ, అలయ కమిటీ భాద్యులు తదితరులున్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు