సిద్దిపేట, మార్చి 12: సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. నియోజకవర్గంలో 8 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు ఒక్కోటి రూ. 13.50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సిద్దిపేట రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల పుల్లూరు, చిన్నకోడూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలు విఠలాపూర్, మాచాపూర్, రామునిపట్ల గ్రామాల్లో, నంగునూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆంక్షపూర్, నారాయణరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల గుర్రాల గొంది, సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ హైసూల్ నాసర్‌పురా ఉర్దూ మీడియం, ప్రభుత్వ న్యూ హైసూల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.