రామాయంపేట/ చేగుంట ఫిబ్రవరి 14: బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ గణపురం సంతోశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ భూపతి, వార్డు మెంబర్లు అంజిరెడ్డి, కొండాపూర్ లక్ష్మి, చితుకుల ఎల్లం పార్టీలో చేరారన్నారు. అనంతరం కర్నాల్‌పల్లి సర్పంచ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ చేపడతున్న పనులకు ఆకర్షితులై తామంతా పార్టీలో చేరామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని, తమకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అండగా ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.
కుల సంఘాలకు పెద్దపీట వేస్తున్న సీఎం
కుల సంఘాలు, దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద పద్మశాలీ, ముదిరాజ్, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. అనంతరం చందాయిపేట గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో పాలొన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదం శ్రీనివాస్, జనగామ రాములు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒంటరి అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంగళరావు, సర్పంచ్ బుడ్డా స్వర్ణలత, భాగ్యరాజ్, ఒంటరి కొండల్‌రెడ్డి, ఆయా కులసంఘాలు, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు ఉన్నారు.