కొల్చారం, సెప్టెంబర్ 18: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలోని మాధవానంద సరస్వతి ఆధ్యాత్మిక పీఠాన్ని శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ దర్శించుకున్నారు. పీఠాధిపతి మధనానంద సరస్వతి చతుర్మాస్య దీక్ష విరమిస్తూ బుధవారం పౌర్ణమి సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్‌కు మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. దర్శనానికి వచ్చిన స్పీకర్‌ను అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఆహ్వానించారు.
అనంతరం స్పీకర్ పీఠాధిపతి మదనానందస్వామి వారిని దర్శించుకున్నా రు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్‌ను సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు ప్రకటించేలా చూడాలన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నర్సాపూర్ ఆర్డీ వో జగదీశ్వర్‌రెడ్డి, కొల్చారం తహసీల్దార్ గఫార్‌మియా, ఆర్ఐ ప్రభాకర్ ఉన్నారు.
చిలిపిచెడ్, సెప్టెంబర్ 18: మండలంలోని చిట్కుల్ శివారులో వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు. స్పీకర్ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.