KCR | గజ్వేల్ : మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యుల నడుమ జరిగాయి. రంగు రంగుల ముగ్గుల రంగవల్లులు, సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే పలు రకాల అలంకరణలతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి సంక్రాంతి శోభ వెల్లివిరిసింది.
ఎర్రవెల్లి నివాసానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భార్య శైలిమ, పిల్లలు హిమాన్షు, అలేఖ్యతో కలిసి వెళ్లి కల్వకుంట్ల శోభమ్మ-చంద్ర శేఖర్ రావుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు కుమారుడు, కోడలు, మనుమడు, మనుమరాలిని మనస్పూర్తిగా దీవించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.