Women Degree College | మునిపల్లి, ఆగస్టు 31 : మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నిజంగానే సమస్యలు ఉన్నాయా..? కళాశాల ప్రిన్సిపల్ మేడమే విద్యార్థుల సమస్యనా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పురుగుల అన్నం పెడుతున్నారని డిగ్రీ కాళశాల సమీపంలో గల ముంబై జాతీయ రహదారిపై ధర్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు నమ్మదగ్గ సమాచారం ఉండడంతో ముంబై జాతీయ రహదారిపైకి విద్యార్థులను వెళ్లనివ్వకుండా మండల అధికారి చర్యలు తీసుకోవడంతో డిగ్రీ కళాశాల ఆవరణలోనే విద్యార్థులు ధర్నాకు దిగారు. ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన జిల్లా అధికారులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం అధికారులు విద్యార్థులతో మాట్లాడుతూ.. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని విద్యార్థులకు భరోసా కలిపించారు. గత నెల రోజుల నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవడంలేదని విద్యార్థులు జిల్లా అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు హాస్టల్లో డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే విద్యార్థులే పైసలు పెట్టి వైద్యం చేయించుకోవాలి తప్ప ఎవరు పట్టించుకోరంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో మా సమస్యలు పరిష్కరించే వారే కరువయ్యారు.. అంటూ విద్యార్థులు అధికారులకు వారు గోడును వినిపించారు.
గత 3 నెలల క్రితం మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ గా శైలజ బాధితులు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన 90 రోజుల్లోనే విద్యార్థులకు ప్రిన్సిపల్ పై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని అనుమానాలు జిల్లా అధికారుల్లో మొదలయ్యాయి. విద్యార్థులకు నిత్యం పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయి అని విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేసేందుకు వస్తున్నాట్లు సమాచారం అందుకున్న జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకున్న అధికారులు వంట తయారు చేసే వల్ల దగ్గరికి వెళ్లి వంట మనుషులను పలు రకాల ప్రశ్నలు ప్రశ్నించగా వంట చేసే వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు సార్… మా సమస్య ప్రిన్సిపాల్ మేడమే అంటూ విద్యార్థులు వంట మనుషులకు అండగ నిలుస్తూ జిల్లా అధికారులకు వంట వారి తరఫున సమాధానం ఇవ్వడంతో అధికారులు ఏమ్ చేయాలో దిక్కు తోచక మీరు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు మరోసారి భరోసా అందిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి అధికారులు వెళ్లిపోయారు.
మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల వెనుక ఉండి సమస్యలను రోడ్డుపై తీసుకువస్తుందెవరు.. అని అడిగితే విద్యార్థుల వెంట నడిపిస్తుంది కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది లెక్చరర్లే అని స్థానికులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల విద్యార్థుల వెంట కళాశాలలో కొన్ని ఏండ్ల తరబడి పాతుకుపోయిన కొంతమంది అధ్యాపకుల బృందమే విద్యార్థుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
అధికారులు విద్యార్థులు విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో కొంతమంది విద్యార్థులు కొత్త ప్రిన్సిపాల్ మేడం వచ్చినప్పటి నుంచి క్లాసులు మంచిగా జరుగుతున్నాయని కళాశాలలోని కొంతమంది విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది లెక్చరర్లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పలు వ్యవహారాలు జిల్లా అధికారులు దృష్టికి రావడంతో అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
మునిపల్లి మండలంలోని బుదేరా మహిళ డిగ్రీ కళాశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చర్వతో (50)డబుల్ కాట్ పరుపులు పంపిస్తే (20)పరుపులు మాత్రం కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌తో పాటు కొంతమంది లెక్చరర్లు ఇంటికి తీసుకుపోయినట్లు కళాశాలలోని ఓ అధికారి తెలిపారు.
ఫిబ్రవరి మాసంలో వచ్చిన పరుపులు కళాశాలలోని విద్యార్థులకు ఇవ్వకుండా లెక్చరర్లు ఇంటికి తీసుకుపోయి వినియోగించుకోవడంపై జిల్లా అధికారులు ఎందుకు ఆరాతీయడం లేదని పలువురు విద్యార్థులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గతంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన ఓ ప్రిన్సిపల్ మేడం కు అనుకూలంగా ఉండేందుకు విద్యార్థుల చేత లేనిపోని కార్యక్రమాలు చేపిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మునిపల్లి మండల ప్రత్యేక అధికారి రామాచారి, ఆందోల్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి జగదీష్, మునిపల్లి తహసిల్దార్ రంగారావు తదితరులు ఉన్నారు.

Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే