జహీరాబాద్, మార్చి 14: ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రాంతంలో చేసిన సేవలే చిరస్మరనీయంగా నిలిచి పోతాయని ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ విజయకుమార్ (Vijaykumar) అన్నారు. మొగుడంపల్లి ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఉదయభాస్కర్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజేశ్వర్ బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి ఇరిగేషన్ శాఖకు ఉదయభాస్కర్ వన్నె తెచ్చారని కితాబు ఇచ్చారు. మిషన్ కాకతీయ లో లెక్కకు మిక్కిలి పనులు చేయించి కాంట్రాక్టర్ల మదిలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సీనియర్ల సలహాలు తీసుకుంటూ ఉద్యోగంలో మెలకువలు తెలుసు కోవాలని పదోన్నతిపై బదిలీ అయిన నాగరాజేశ్వర్ను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
తన పదవీ కాలం మొత్తం జహీరాబాద్‌లోనే సాగిందని, తనకు తొడ్పాటుకు అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సహకరించిన డీబీ, ఏబీ సెక్షన్లకు ఉదయభాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ తన శాయశక్తుల ఇరిగేషన్ శాఖ అభివృద్ధికి పాటుపడుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈలు రాజ్యలక్ష్మి, జనార్దన్, భార్గవి, ఏఈఈలు రవీందర్, జానకిరామ్, శ్రీహరి, అంజయ్య, అయూబ్, జగన్నాధం, శ్రీనివాస్, పాండు, తేజశ్రీ, లలిత, వసుధ, లావణ్య, చందన, రాకేష్, వెంకన్న, వర్క్ ఇన్స్పెక్టర్లు రఘు, జహీర్, నర్సింలు, ప్రసాద్, నవాజ్ సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, సిబ్బంది అనిల్ కుమార్, శంకర్, విజయ్, రామారావు, తులసి, శివరాజ్, శంకర్, బషీర్, సుధ, అనిరుధ్, ప్రవీణ్, దయాకర్, ఆరిఫ్, సుధాకర్, ఈరమ్మ, పూలమ్మ, యాస్మిన్ పాల్గొన్నారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.