SP Paritosh Pankaj | సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన పరితోష్ పంకజ్ స్వస్థలం బీహార్ రాష్ట్రం బోజ్పూర్ జిల్లాలోని ఆరా పట్టణం. గతంలో భద్రాచలం అదనపు ఎస్పీగా, భద్రాద్రి కొత్తగూడెం ఓ.యస్.డి గా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డ్యూటి పరంగా లేదా పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని..వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని, చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు.
శాంతి భద్రతల రక్షణలో భాగంగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని, మహిళలు, చిన్నారుల భద్రత విషయమై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి