సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 19 : ప్రజావాణికి అర్జీదారుల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
ఆయా సమస్యలను అధికారులకు తెలియజేస్తూ వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారుల నుంచి వివిధ వినతి పత్రాలను స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు జారీ చేస్తూ వాటిని సకాలంలో విచారించి పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిలా అదనపు కలెక్టర్లు రాజర్షీ షా, వీరారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.