జహీరాబాద్, జూన్ 16 : ఎన్నికల్లో చేతగాని హామీలు ఇచ్చి పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేయడం పట్ల జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు మండిపడ్డారు. సోమవారం ఈ ఫార్ములా కేసులో సిబిఐ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్ములా – ఈ రేసు కేసులో మళ్లీ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులపై పెట్టే కేసులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ రావడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్, మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్, జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్, మాజీ సర్పంచ్ లు బస్వరజ్ ,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్, అశోక్ పాటిల్, రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు పాల్గొన్నారు.