
మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్/పెద్దశంకరంపేట/మెదక్‌అర్బన్,/అల్లాదుర్గం / హవేళీఘనపూర్ /పాపన్నపేట/చిన్నశంకరంపేట ,ఆగస్టు15: స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసు నివాళులలర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ , మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ,జిల్లా టీన్జీవో భవన్ వద్ద అధ్యక్షుడు దొంతి నరేందర్ జాతీపతకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని ఆయా పాఠశాలలు, కళాశాలలతో పాటు వార్డులలో వార్డుల కౌన్సిలర్లు జాతీయపతకాన్ని ఆవిష్కరించారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యమున , బాలసదనంలోజిల్లా సంక్షేమ అధికారి జయరాంనాయక్ , వ్యవసాయకార్యాలయంలో డివిజన్ వ్యవసాయా ధికారి నగేశ్, ఇతర ప్రభుత్వ కార్యాలయల్లో, సంబంధితఅదికారులు, గ్రామ పంచాయతీలో సర్పంచ్‌లు , అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద దశరథ్, పోలీస్‌స్టే షన్ వద్ద ఎస్ఐ శేఖర్‌రెడ్డి, సర్దన పీహెచ్సీ వద్ద డాక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి కార్యా లయం వద్ద ఏవో నాగమాధురి, పశువైద్యశాల వద్ద డాక్టర్ లక్ష్మణ్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం భాస్కర్ల, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్‌లు, పాఠశాలల వద్ద ప్రధానో పాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. పెద్దశంకరంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ చరన్సింగ్, గ్రామపంచాయతీ సర్పంచ్ సత్యనారాయణ జెండాఎగురవేశారు
అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి,తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సాయాగౌడ్,పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మోహన్‌రెడ్డి,వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏ వో నాగమణి,ఆయా ప్రభుత్వ పాఠశాలల వద్ద ప్రధానుపాధ్యాయులు జాతీయ పతాకాలను ఎగరవేశారు.పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ చందన , తహసీల్దార్ కార్యాలయం వద్ద లక్ష్మణ్, పాపన్నపేట పోలీస్‌స్టేషన్ వద్ద ఎస్సై సురేశ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, ఏడుపాయాల్లో ఈవో సార శ్రీనివాస్ పతాకావిష్కరణ గావించారు.
చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజేశ్వర్‌రావు, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.