kcr cricket tournament | మునిపల్లి, ఏప్రిల్ 18: ఈనెల 24 నుంచి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్ద గోపురం గ్రామంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శేఖర్, రాజు, మహేశ్, ప్రదీప్‌లు తెలిపారు. పెద్ద గోపులారంలో శుక్రవారం నాడు నిర్వాహకులు మాట్లాడుతూ.. కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈనెల 24 నుంచి నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజేతగా నిలిచే జట్టుకు రూ. 50వేలు, రన్నరప్‌నకు రూ. 30వేలు అందించేందుకు మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది మంతూరి శశికుమార్ స్పాన్సర్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేవారు ఈ నెల 23సాయంత్రం 6 గంటల వరకు తమ.. తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రూ. 1500 చెల్లించి తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 24న ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించునున్నట్లు తెలిపారు. తమ జట్ల పేర్లను టోర్నమెంట్లో నమోదు చేసుకునేందుకు నెంబర్లను శేఖర్-9701503712, మహేశ్ -9705263235, రాజు-6302387871, ప్రదీప్-8897103178లకు సంప్రదించాలన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు టోర్నమెంట్ నిబంధనలు పాటించాలన్నారు. టోర్నమెంట్ నిబంధనలు లెక్కచేయకుండా నిర్లక్ష్యం ఇస్తే టోర్నమెంట్ నుంచి అ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.