Jogipet : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ (Anil Kumar) పిస్టల్ హఠాత్తుగా పేలింది. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో సీఐ టేబుల్ పక్కన కూర్చున్న హెడ్ కానిస్టేబుల్ పక్క నుండే బుల్లెట్
దుసుకెళ్ళింది. వేగంగా వెళ్లిన తూటా గోడకు తాకి పగిలింది. దాంతో, కొద్దిలో కానిస్టేబుల్కు పెద్ద ప్రమాదం తప్పింది.
సీఐ పిస్టల్ పేలిన సమయంలో ఆంధోల్ మాజీ కౌన్సిలర్ హరిక్రిష్ణ, ఆత్మ డైరెక్టర్ రొయ్యల శ్రీనివాస్, మరికొందరు స్టేషన్లోనే ఉన్నారు. బుల్లెట్ శబ్దం విని వీరంతో భయంతో బయటకు పరుగులు తీశారు.