Road | మునిపల్లి, ఏప్రిల్ 23ఫ: ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే మాకేం సంబంధం లేదు అన్నట్టు విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో కొంతమంది వ్యాపారాలు దర్జాగా సర్కార్ భూములను కబ్జాలు చేస్తూ సర్కార్ భూముల్లో రోడ్డు నిర్మాణాలు చేస్తున్నరనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మునిపల్లి మండలంలోని కంకోల్, అంతరం గ్రామల్లో ప్రధాన రోడ్డును అతి దగ్గరలో అక్రమ నిర్మాణాలు చేయడంఫై ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబయి జాతీయ రహదారిఫై ఉన్న కంకోల్ గ్రామ సమీపంలో ఓ వ్యాపారి వెంచర్ నిర్మాణం చేస్తూ వెంచర్ లొకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కంకోల్ -తాటిపల్లి ప్రధాన రోడ్డు పక్కన ఉన్న సర్కార్ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తు రోడ్డు నిర్మాణం చేశారు. దీంతో సర్కార్ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు నిర్మాణం చేపట్టిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే అక్రమంగా కూలగొడుతన్న ప్రభుత్వానికి కంకోల్, అంతరం గ్రామాల్లో సర్కార్ భూములను కబ్జా చేస్తుంటే కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అఫీషియల్ మ్యాప్ ఇవ్వం..
మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో నూతంగా నిర్మాణం చేపడుతున్న ఓ వెంచర్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల పత్రాలు, సర్వే మ్యాప్ లు అడిగితే…అది అఫీషియల్ మ్యాప్ ఇవ్వడానికి కుదరదు అన్నట్టు మునిపల్లి మండల సర్వేయర్ చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తుంది..సర్కార్ భూములను సరిచేసి ఉంచాల్సిన అధికారులే తప్పుడు సర్వేలతో తప్పుడు మ్యాపులతో వెంచర్ల నిర్మాణం చేసే వ్యాపారులకు తొత్తులుగా మారి ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి చేసేందుకు వారి… వారి వంతుగా సహకరిస్తున్న సంబంధిత అధికారుల పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : మునిపల్లి తహసిల్దార్ రంగారావు
సర్కార్ భూముల్లో అక్రమంగా కట్టడాలు కడుతున్నారన్న విషయంఫై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం. మునిపల్లి మండలంలో సర్కార్ భూములను కబ్జా చేసేవారు ఏంతటి వారైనా సరే సహించేది లేదు. మునిపల్లి మండలంలో సర్కార్ భూముల్లో అక్రమ కట్టడాలు, కబ్జాలు చేస్తే మునిపల్లి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలి. మునిపల్లి మండలంలోని కంకోల్, అంతరం గ్రామల్లోని సర్కార్ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.


Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video