రాయికోడ్, సెప్టెంబర్ 29 : పత్తి పంటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున గంజాయి మొక్కలను ధ్వంసం చేసింది. బుధవారం రాయికోడ్ మండల పరిధిలోని ఉల్గెరా గ్రామా శివారులో నాలుగు ఎకరాలలో పత్తి పంటలో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామని జిల్లా ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ సీఐలు రమేష్‌రెడ్డి, మోహన్‌కుమార్ తెలిపారు.
న్యాల్కల్ మండల పరిధిలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సింహారెడ్డి ఉల్గెరా గ్రామా శివారులో ఉన్న పొలంలో సుమార్ 4500 గంజాయి మొక్కలను సాగుచేస్తున్నాడు. తమ సిబ్బందితో కలిసి పంట పొలంలోనే గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందాన్నారు. ఈ దాడులలో ఎస్ఐ కె.విశ్వనాథం, సిబ్బంది ఉన్నారు.