కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో కలెక్టర్ శరత్ ఆకస్మికంగా రావడంతో కంటివెలుగు సిబ్బంది హడలెత్తిపోయారు.
- చిట్కుల్లో కంటి వెలుగు నిర్వహణపై మండిపాటు
- నిర్లక్ష్యంగా ఉంటే చర్యలుంటాయని హెచ్చరిక
పటాన్చెరు, జనవరి 27: చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో కలెక్టర్ శరత్ ఆకస్మికంగా రావడంతో కంటివెలుగు సిబ్బంది హడలెత్తిపోయారు. శిబిరం ప్రజలు లేక వెలవెలబోతుండటం చూసి కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఈ రోజు ఎంతమందికి పరీక్షలు చేశారని అడిగి, సిబ్బంది రిజిస్టర్‌ను పరీక్షించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటి వెలుగుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు రావడం లేదని అన్నారు. మీ నిర్లక్ష్యంతో చక్కటి కార్యక్రమం నీరుగారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు రోజువారీగా ఉన్న టార్గెట్‌లో సగం మందికూడా రాకపోతే ఎలా అని నిలదీశారు. వైద్య నిపుణులను కూడా కలెక్టర్ పరీక్షల వివరాలు అడిగారు. ఇక మీదుట కంటివెలుగు క్యాంప్‌లో పరీక్షలు వేగవంతం చేయనిపక్షంలో చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. క్యాంప్‌లో పరీక్షలు వేగవంతం చేస్తామని వైద్యబృందం కలెక్టర్‌కు హామీనిచ్చింది.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

