Harish Rao | గుమ్మడిదల, మార్చి9: డంపింగ్‌యార్డు రద్దు కోసం అన్ని సాక్ష్యాధారాలతో గ్రీన్‌ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాలని డంపింగ్‌యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించారు. శనివారం రాత్రి మాజీ మంత్రి, రామచంద్రాపురం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ్‌రెడ్డితోపాటు నర్సాపూర్‌లో ఓ కార్యక్రమానికి వెళుతుండగా గుమ్మడిదల జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ప్రవీణ్‌రెడ్డి, సూర్యనారాయణ తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డంపింగ్‌యార్డును రద్దు చేయాలంటే కోర్టుల ద్వారా పోతేనే న్యాయం జరుగుతుందని సూచించారు. వీరితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.