మనూర్ : మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు. జాతర ముగిసిన సందర్భంగా హుండీ లెక్కింపు నిర్వహించి వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లయ్య, ఎస్సై కోటేశ్వరరావు, ఏఎస్ఐ గోవింద నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, నాగయ్య స్వామి, ప్రవీణ్ స్వామి, ఆలయ సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, శేఖర్, భక్తులు పాల్గొన్నారు.