మునిపల్లి, మర్చి 4 : గ్రామల్లో ప్రజల తీర్పుతో గెలిచిన వార్డు మెంబర్లు అంటే అంత చిన్నచూపు ఎందుకు అంటూ..సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వార్డు మెంబర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలో గెలుపొందిన వార్డు సభ్యులకు మండల కేంద్రమైన మునిపల్లిలో గల రైతు వేదికలో నేటి నుంచి వార్డు మెంబర్లకు అవగాహన సదస్సు కార్యకార్యక్రమం ఏర్పాటు చేయడం అంత బాగానే ఉంది.
మండల కేంద్రమైన మునిపల్లితో పాటు బుసరెడ్డిపల్లి, మల్లారెడ్డిపేట, మల్లికార్జునపల్లి, అల్లాపూర్,తక్కడపల్లి, బోడపల్లి, ఖమ్మంపల్లి, పోల్కంపల్లి, పెద్ద గోపులారం గ్రామాల్లోని (96)మంది వార్డు సభ్యులకు అవగాహన సదస్సు ఇచ్చేందుకు ఆహ్వానించారు. అయితే అధికారులు గైర్హాజరు కావడంతో వార్డు మెంబర్లు అసహనం వ్యక్తం చెస్తున్నారు. వార్డు మెంబర్లు అంటే అధికారులకు చిన్నచూపు ఏందుకు ఆని అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు.
వార్డు సభ్యులను పిలిచి అధికారులు సమావేశానికి రాకపోవడం ఏంటి ఆని ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది ఆని చెప్పిన అధికారులే సమయపాలన పాటించకుండా వార్డు సభ్యులను అవమాన పరిచే విధంగా వ్యవహరించడమే అని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి సమావేశానికి హాజరు కానీ అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరుతూన్నారు.