రాయికోడ్ , జూన్ 6: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్‌గా ఆశాజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన నాయబ్ తహసీల్దార్ విజయకుమార్ నుంచి చార్జిని తీసుకున్నారు. ఆశాజ్యోతి సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డీఎవోగా విధులు నిర్వహిస్తు రాయికోడ్ తహసీల్దార్‌గా బదిలిపై రావడం జరిగింది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆశాజ్యోతి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్యాలయానికి వచ్చి తెలపాలని కోరారు. పైరవీకారుల మాటలు నమ్మకూడదని సూచించారు. మీ సేవ, అన్లైన్ చేసేవారు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎక్కువ తీసుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.