
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 25 : ప్రతి గ్రామం అభివృద్ధి చెంది సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంతో పాటు బూరుపల్లి, వాడి తదితర గ్రామాల్లో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెప్రగతి పేరిట ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు సీఎం నిధు లు కేటాయిస్తున్నారని తెలిపారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గాజిరెడ్డిపల్లి, కూచన్‌పల్లి గ్రామాల్లో లబ్ధ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్‌లు యామినిరెడ్డి, సరిత సాయగౌడ్, శ్రీనివాస్, కిషన్‌నాయక్, రమేశ్, సంద్యారాణి, ఎంపీటీసీ రాజయ్య, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు సాప సాయిలీ, టీఆర్ఎస్ నాయకులు సుభాశ్, బీమయ్య, భిక్షపతిరెడ్డి, తులసీరాంలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.