మునిపల్లి, జూలై 1: కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ ప్ర భుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేస్తూ కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. సకల సౌకర్యాలతో మెరుగైన విద్యాను అందిస్తున్నది. గురువారం విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మునిపల్లి ఆదర్శ పాఠశాలతో పాటు మండలంలోని మల్లికార్జునపల్లి, బుధేరా, ఖమ్మంపల్లి, తాటిపల్లి, అంతారంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బడులు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మునిపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆదర్శ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత శాతం సాధించినట్లు మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల, తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు.
మండలంలోని ‘పది’ విద్యార్థు లు ఫలితాల్లో మెరుగైన ర్యాంకు లు సాధించడంతో మునిపల్లి ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్ ఆ యా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులతో పా టు మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని సాహితీ 9.8ర్యాంకు సాధిం చి అవురా అనిపించింది. మండలంలో (12)ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆదర్శ పా ఠశాల, కస్తూర్బా గాంధీ, గురుకుల పాఠశాలలు ఉండగా, జిల్లా పరిషత్ పాఠశాలలు(5), ఆదర్శ పాఠశాల, తాటిపల్లి కస్తూర్భాగాంధీ, గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మునిపల్లి విద్యాధికారి దశరథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్ఈవో మాట్లాడుతూ మునిపల్లి(96%), పెద్దగోపులారం(94%), కంకోల్(98%), లోనికాలన్ (93%), పెద్దచెల్మెడ (92%), మేళాసంగెం (72%), కంకోల్ ఉర్దు మీడియం (94%) ర్యాంకులు వచ్చాయన్నారు. ఈసా రి మునిపల్లి మండలంలో మంచి ర్యాంకులు రావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం అన్ని పాఠశాలల్లో వం దశాతం ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తాం.